Take a fresh look at your lifestyle.

సూర్యాపేట పట్టణంలో అక్రమంగా నిల్వచేసిన 41 గ్యాస్ సిలిండర్లు సీజ్

 

గ్యాస్ సరఫరా ఏజెన్సీలు అప్రమత్తంగా ఉండాలి

నకిలీ వ్యక్తులకు గ్యాస్ సిలిండర్ లు ఇవ్వకూడదు

ముద్ర ప్రతినిధి , కోదాడ ….. నమ్మదగిన సమాచారం పై సూర్యాపేట పట్టణ పోలీసులు స్పెషల్ బ్రాంచ్ పోలీస్ సిబ్బంది సూర్యాపేట పట్టణంలో పిఎస్ఆర్ సెంటర్ నందు ఒక షాపులో తనిఖీలు నిర్వహించగా అందులో అక్రమంగా నిల్వచేసిన 41 సిలిండర్ లు గుర్తించడం జరిగిందని వీటిని సీజ్ చేశామని జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ గారు ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో 21 గృహ ఉపయోగకరమైనయని, 20 వాణిజ్యపరమైనని ఉన్నాయని అన్నారు. దీనికి సంబంధించి అక్రమ వ్యాపారం నిర్వహిస్తున్న వ్యక్తి పై కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. ప్రజల అవసరాలకు ఉపయోగపడే గ్యాస్ సిలిండర్లను అక్రమ మార్గంలో అమ్మిన, అక్రమంగా నిలువచేసిన, కృత్రిమ కొరత సృష్టించిన అలాంటి వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గృహ ఉపయోగకరమైన గ్యాస్ సిలిండర్లను వాణిజ్యపరంగా అమ్మకూడదని సూచించారు. ప్రజల ఉపయోగాలు, హాస్పటల్ వినియోగానికి నిలువలు అందుబాటులో ఉన్నాయి. గ్యాస్ సిలిండర్ లను అక్రమ మార్గంలోకి తరలించినా, గ్యాస్ నిల్వలపై, గ్యాస్ ధరలపై ఎవరైనా తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు
ప్రజల అవసరాలకు సరిపడా గ్యాస్ సిలిండర్ నిలువలు అందుబాటులో ఉన్నాయని ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. నిబంధనల ప్రకారం సంబంధిత ఏజెన్సీలు గ్రామాలలో, పట్టణాలలో వినియోగదారులకు గ్యాస్ సిలిండర్లను సకాలంలో అందిస్తాయని అన్నారు. ప్రజలు ఆందోళన చెంది గ్యాస్ ఏజెన్సీల వద్ద బారులు తీరవద్దని, గ్యాస్ టోల్ ఫ్రీ నెంబర్లను సంప్రదించవద్దని కోరారు. గ్యాస్ ఏజెన్సీలు అప్రమత్తంగా ఉండాలని ఎవరైనా నకిలీ వ్యక్తులు గ్యాస్ ను బుక్ చేసినట్లయితే అలాంటి వారిని గుర్తించాలని కోరారు. గ్యాస్ సిలిండర్లు సరఫరా చేస్తున్న ఏజెన్సీలు బాధ్యతగా ఉండాలని కోరారు. గ్యాస్ అమ్మకాల కు సంబంధించి పోలీస్ శాఖ అప్రమత్తంగా ఉందని పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.