– – సొంత ఇంటిని గ్రామపంచాయతీ కార్యాలయానికి విరాళంగా ఇచ్చిన ఇంద్రసేనారెడ్డి
- త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డిని హైదరాబాదులోని లోక్భవన్లో ఘనంగా సన్మానించిన గానుగుబండ గ్రామస్తులు
- తన జన్మస్థల అభివృద్ధికి ఎల్లవేళలా కృషి చేస్తా
- త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి

ముద్ర….. తుంగతుర్తి….
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం గానుగుబండ గ్రామానికి చెందిన ప్రస్తుత త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డిని ఆ గ్రామ సర్పంచ్ మాతంగి వెంకటమ్మ కరుణాకర్ తో పాటు గ్రామ పెద్దలు శనివారం హైదరాబాదులోని లోక్భవన్లో మర్యాదపూర్వకంగా కలిశారు .ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ తో పాటు గ్రామస్తులు గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డిని శాలువాలతో సన్మానించారు .తన జన్మస్థలమైన గానుగుబండ గ్రామం నుంచి సర్పంచ్ తో సహా గ్రామ పెద్దలు అందరూ రావడం తనకు ఎంతో సంతోషకరమని తాను పుట్టిన గ్రామానికి తన వంతు సహాయం అందిస్తానని వారికి తెలిపినట్లు సర్పంచ్ మాతంగి వెంకటమ్మ కరుణాకర్ తెలిపారు .ఈ సందర్భంగా తమ గ్రామానికి గ్రామపంచాయతీ లేకపోవడంతో తమ సొంత ఇల్లు నే గ్రామపంచాయతీకి విరాళంగా ఇవ్వనున్నట్లు ఇంద్రసేనారెడ్డి తెలిపారని, అలాగే గ్రామంలో 50 లక్షల సిసి రోడ్లను మంజూరి ఇస్తున్నట్లు, కరివిరాల నుండి వెంపటి వరకు తారు రోడ్డు సౌకర్యం, గ్రామంలోని నిరుపేదలకు 50 పక్కా గృహాలు, 50 లక్షల వ్యయంతో వెనుకబడిన తరగతుల వారికి కమ్యూనిటీ హాల్ను, మంజూరీ చేస్తున్నట్లు త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి తెలిపినట్లు సర్పంచ్ తెలిపారు. ఈ సందర్భంగా తమ గ్రామానికి లక్షలాది రూపాయల అభివృద్ధి పనులను మంజూరు చేసినందుకు సర్పంచ్ తో పాటు గ్రామ పెద్దలు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తో పాటు గ్రామ మాజీ సర్పంచ్ నల్లు రామచంద్రారెడ్డి, గుండ గాని రాములు గౌడ్, మాజీ ఎంపీటీసీ గుండ గాని దుర్గయ్య గౌడ్, సింగిల్ విండో డైరెక్టర్ కుశలవ రెడ్డి, వార్డు మెంబర్లు ఆశాలు, వెలిశాల వెంకన్న, ఎనగందుల రామచంద్రయ్య, పోలేపాక సోమయ్య, పోలేపాక రవి, పంజాల సతీష్, భూపతి సైదులు, పోలేపాక సతీష్, వై రమేష్, సతీష్ ,లతోపాటు పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు