ముద్ర ప్రతినిధి, మెదక్:
జిల్లా కేంద్రం మెదక్ పట్టణం శ్రీ కోదండ రామాలయంలో ఉగాది ఉత్సవాలు వైభవంగా జరిగాయి. సాయంత్రం స్వామివారి సన్నిధిలో నిర్వహించిన పంచాంగ పఠనంలో మున్సిపల్ చైర్ పర్సన్ కానుగు రాధికా భూపతిరాజ్, వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్, కౌన్సిలర్లు మాయా గంగమణి మల్లేశం, తొడుపునూరి శివరామకృష్ణ, మామిళ్ళ ఆంజనేయులు బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్, ఆలయ కమిటీ అధ్యక్షులు నరేందర్ భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.

వైద్య శ్రీనివాస్ పంచాంగ పఠనం అనంతరం పచ్చడి, తీర్థ ప్రసాద వితరణ గావించారు. ఈ సందర్భంగా చిన్నారుల నృత్య ప్రదర్శనలు విశేషంగా కట్టుకున్నాయి.
