Take a fresh look at your lifestyle.

భద్రేశ్వర దేవాలయంలో పంచాంగ శ్రవణం -పాల్గొన్న తాండూర్ శాసనసభ్యులు మనోహర్ రెడ్డి

 

ముద్ర, తాండూర్:

వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలోని ప్రసిద్ధి ప్రసిద్ధిగాంచిన భద్రేశ్వర స్వామి దేవాలయంలో పంచాంగ శ్రవణం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

ఇట్టి కార్యక్రమానికి పట్టణంలోని హిందూ బంధువులు, దేవాలయ కమిటీ సభ్యులతో కలసి పాల్గొన్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి. ఈ సందర్భంగా వేద పండితుల పంచాంగ శ్రవణం మనోరంజకంగా కొనసాగింది. ఈ ఏడాది జరిగే శుభకార్యాలు కష్టనష్టాల గురించి పలు రాశుల ఫలితాలను వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ నూతన సంవత్సరంలో చెడు పరా భావం మంచితనం విజయం సాధించాలని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ పట్లోళ్ల నీరజ, మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోళ్ల నర్సింలు, దేవాలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.