మహాదేవపూర్, ముద్ర:
శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానంలో నూతన సంవత్సర ఉగాదిని పురస్కరించుకొని ఆలయ ఉప ప్రధాన అర్చకులు నాగఫణి శర్మ ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం నిర్వహించడం జరిగినది. మండల కేంద్రంలోని రామాలయంలో తిరుపతి మురళీధర స్వామి పంచాంగం వినిపించగా, ఉమామహేశ్వర ఆలయంలో సాలగ్రామ శ్రీనివాస్ శర్మ పంచాంగ శ్రవణం చేయించారు. పలు కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇట్టి కార్యక్రమాలలో ఆలయ వేద పండితులు అర్చక స్వాములు,కాళేశ్వరం గ్రామ సర్పంచ్ వెన్నపురెడ్డి మోహన్ రెడ్డి, రామాలయంలో నిషేధిత పరిషత్ అధ్యక్షులు దేవరావు, ఉమామహేశ్వర ఆలయంలో మాజీ కాలేశ్వరం దేవస్థానం చైర్మన్ రామన్ రావు ఆయాగ్రామాల పుర ప్రముఖులు, వ్యాపారులు, భక్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు.