Take a fresh look at your lifestyle.

చంద్ర గ్రహణం సందర్భంగా స్వర్ణగిరి ఆలయం మూసివేత

ముద్ర, భువనగిరి ప్రతినిధి :
భూలోక వైకుంఠంగా ప్రసిద్ధిగాంచిన స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో మంగళవారం సంభవించిన కేతు గ్రహ గ్రస్త చంద్ర గ్రహణం సందర్భంగా ఆలయ నియమావళి ప్రకారం ప్రత్యేక చర్యలు తీసుకోబడినవి. ఉదయం త్రికాల ఆరాధనలు, నిత్య పూజలు, నివేదనలు సమగ్రంగా నిర్వహించుకొని ఉదయం 8.00 గంటలకు ఆలయ కవాట బంధనం ఆలయ తలుపుల మూసివేశారు. అనంతరం 4న బుధవారం ఆలయ శుద్ధి కార్యక్రమాలు, పుణ్యాహవచనం, సంప్రోక్షణాది వైదిక క్రతువులు శాస్త్రోక్తంగా నిర్వహించబడి
సమస్త కార్యక్రమాలు పూర్తి అయిన అనంతరం మధ్యాహ్నం 2.30 గంటల నుండి భక్తులకు శ్రీ వారి దర్శన భాగ్యం కల్పించబడునని ఆలయ ప్రధాన అర్చకులు దిట్టకవి శ్రవణాచార్యలు తెలిపారు.
భక్తులు ఈ విషయాన్ని గమనించి దేవస్థానం సూచనలను పాటించి సహకరించాలాన్నారు.

Leave A Reply

Your email address will not be published.