- ఎం ఎల్ ఏ ఏలేటి మహేశ్వర్ రెడ్డి
ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ నియోజకవర్గ అభివృద్దే లక్ష్యంగా ముందుకు సాగుదామని ఎంఎల్ఏ ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. సారంగాపూర్ మండలం స్వర్ణ గ్రామంలో ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ముందుగా ప్రాజెక్ట్ కుడి కాలువ ద్వారా దిగువకు నీటిని విడుదల చేశారు. రైతులు పంట పొలాలకు నీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రూ. 32 లక్షలతో లైటింగ్ ఏర్పాటుకు భూమి పూజ చేశారు. హెల్త్ సబ్ సెంటర్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.హెల్త్ సబ్ సెంటర్ నిర్మాణం పూర్తయితే గ్రామీణ ప్రాంతంలో ప్రజలకు కొంత మేర ఉపయోగకరంగా ఉంటుందన్నారు. సారంగాపూర్ మండల కేంద్రంలోని జౌళినాలా అభివృద్ధిలో భాగంగా రూ.46 లక్షలతో “క్రాస్ రెగ్యులేటర్ & ఎస్కేప్ రెగ్యులేటర్” పునర్నిర్మాణ పనులకు భూమి పూజ చేసారు.ఈ కార్యక్రమంలో జిల్లా మండల బీజేపీ నాయకులు కార్యకర్తలు, ఇరిగేషన్, రెవెన్యూ, పంచాయతిరాజ్ శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.