- బీఆర్ఎస్ హాయంలో సర్వే నెంబర్ 25లో 25 ఎకరాలు కట్టబెట్టారు.
- రెండు భవనాల వద్ద వంది అడుగుల రోడ్లు.
- మై హోం విహాంగ దగ్గర కాంగ్రెస్ ఆందోళన- రోడ్డుపై బైఠాయింపు.
ముద్ర, తెలంగాణ బ్యూరో : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన భూముల్లో మైహోం నిర్మాణ సంస్ధ అక్రమ నిర్మాణాలను చేపట్టిందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ డాక్టర్ బల్మూరి వెంకట్ ఆరోపించారు.బీఆర్ఎస్ హాయంలో సర్వే నెంబర్ 25లో 25 ఎకరాలను కట్టబెట్టారని ఆయన అన్నారు.ఈ మేరకు మంగళవారం గచ్చిబౌలిలోని మైహోం విహాంగ ముందు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ నాయకత్వంలో కాంగ్రెస్ కార్యకర్తలు బైఠాయించి ఆందోళన నిర్వహించారు.బీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.హెచ్ సీయూపై బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు లేని ప్రేమను నటిస్తున్నాయని దుయ్యబట్టారు.ఈ సందర్భంగా ఎమ్మెల్సీ వెంకట్ మాట్లాడుతూ.. కంచే గచ్చిబౌలి లో సర్వే 25లో 2004 లో 534 ఎకరాలు ప్రభుత్వానికి ఇస్తున్నట్టు హెచ్ సీయూ రిజిష్ట్రార్ సంతకం చేశారన్నారు.అందుకు బదులుగా ప్రభుత్వం 397 ఎకరాలు ఇస్తున్నట్టు సంతకం చేసిందని ఆయన గుర్తు చేశారు.మొత్తం 534 ఎకరాల్లో లో 400 ఐఎమ్‌జీ భారత్ కు 120 ఎకరాలు, ఉద్యోగ సంఘాలకు కేటాయించారన్నారు.ఐఎంజీ భారత్ ఒప్పందం ప్రకారం వ్యవహరించలేదని, అందుకే ఆ భూములు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళకుండా రాష్ట్ర ప్రభుత్వం న్యాయపోరాటం చేసిందన్నారు. 400 ఎకరాల భూమిని కోర్టులో కొట్లాడి సాధించామన్నారు.ఈ భూములు ప్రైవేటు వ్యక్తులకు చెందాలని బీఆర్ఎస్ ప్రభుత్వంలోని వ్యక్తులు భావించారని ఆయన ఆరోపించారు.అందుకే ఈ 25 సర్వే నెంబర్‌లోని 25 ఎకరాలను మైహోం విహంగకు బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టబెట్టిందని ఆయన చెప్పారు. ఉద్యోగ సంఘాలకు కేటాయించిన భూమిలో మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్ తప్పుడు పేర్లతో 20 ఎకరాలు ఆక్రమించే ప్రయత్నం చేశారన్నారు.ప్రభుత్వ భూమిలో నిర్మించిన మై హోం నిర్మాణాల వద్దకు ఫాక్ట్ ఫైండింగ్ కమిటీ ఎందుకు ముందుకు రావడం లేదని బల్మూరి వెంకట్ ప్రశ్నించారు.లోపాయికారీ ఒప్పందం లేకపోతే మైహోం నిర్మాణం చేస్తున్నప్పుడు బీఆర్ఎస్ నేతలు ఎందుకు స్పందించలేదని ఆయన నిలదీశారు.
