Take a fresh look at your lifestyle.

గ్రూపు-1 విజేత కృత్తికకు సబితా ఇంద్రారెడ్డి అభినందనలు

మహేశ్వరం, ముద్ర : గత రెండు రోజుల క్రితం వెలువడిన గ్రూపు -1 ఫలితాలలో ఐదవ ర్యాంకు సాధించిన  జిల్లెల్లగూడకు చెందిన మాజీ ఏంపిపి, మాజీ కార్పొరేటర్ సిద్ధాల లావణ్య బీరప్ప కుమార్తె కృత్తికను మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి శాలువ కప్పి, పూల బోకేను అందించి,స్వీట్ ఇచ్చి మనస్పూర్తిగా అభినందించారు.ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి  మాట్లాడుతూ..మట్టిలో మెరిసిన మాణిక్యం లాంటి కృత్తిక కష్టానికి లభించిన ఫలితమన్నారు. కృత్తిక  భవిష్యత్తులో ఉన్నతమైన పదవిని చేపట్టబోతుండటం గర్వంగా ఉందన్నారు. కృత్తిక మంచిగా సేవ చేసి, ప్రజల మన్ననలు పొందాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన పలువురు నాయకులు, ప్రముఖులు పాల్గొని కృత్తికను అభినందించారు.

Leave A Reply

Your email address will not be published.