ముద్ర, మోత్కూర్:
మోత్కూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ రామకృష్ణ చేత ఐదు సంవత్సరాల లోపు వయసు గల శిశు మరణాల పైన సమీక్ష సమావేశం నిర్వహించారు .ఈ సందర్భంగా చిన్నారుల మరణాలను నివారించడానికి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.ఏ వయసుకు వేయించవలసిన టీకాలు ఆ వయసులో వేయించడం గర్భిణీ స్త్రీలకు సకాలంలో అన్ని పరీక్షలు చేయించడం తగిన పోషకాహారం తీసుకునే లాగా చూడడం వంటి వాటి పైన దృష్టి సారించాలని చెప్పారు. ఇందులో మోత్కూరు గుండాల, ఆత్మకూరు, వేముల కొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు సంబంధించిన వైద్యులు సంబంధిత ఏఎన్ఎం లు, ఆశాలు సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు.