Take a fresh look at your lifestyle.

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత: ఎస్ పి రావుల గిరిధర్

ముద్ర, వనపర్తి: మన చుట్టూ ఉండే పర్యావరణాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని వనపర్తి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్  అన్నారు.అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గురువారం రోజు  పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఆటవీశాఖ ఆధ్వర్యంలో  ఎకో పార్క్ దగ్గర  ఏర్పాటుచేసిన కార్యక్రమానికి జిల్లా ఎస్పీ  రావుల గిరిధర్  ముఖ్యఅతిథిగా పాల్గొని   వనపర్తి అదనపు కలెక్టర్ యాదయ్య గారితో కలిసి జండా ఊపి ర్యాలీని ప్రారంభించారు.అనంతరం వనపర్తి పట్టణంలోని ఏకో పార్క్ పరిసర ప్రాంతాలను శ్రమదానం శుభ్రం చేసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ అధునాతన విజ్ఞానం విస్తరిస్తున్న ప్రస్తుత తరుణంలో మనిషి తన ముగడకు కావలసిన చాలా వాటిని యంత్రాల సహాయం ద్వారా అందిపుచ్చుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో కర్మాగారాలు ఫ్యాక్టరీలు వాహనాల వల్ల కొంత కాలుష్యం ఏర్పడటం సహజం.కానీ వాటిని అధిగమించే ప్రత్యామ్నాయ మార్గాలు ఎన్నో ఉన్నాయి.అందులో ప్రధానంగా మొక్కలు నాటడం పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవడం శాస్త్రవేత్తల సూచనలు పాటించడం మన కనీస బాధ్యత గుర్తుంచుకోవాలని వివరించారు. వని అంటే నీరు అని నీరు సమృద్ధిగా ఉండటం వల్ల వనపర్తికి ఆ పేరు వచ్చి ఉంటుందని తెలిపారు.జిల్లా అదనపు కలెక్టర్ యాదయ్య మాట్లాడుతూ ప్రతి ఒక్కరి ఇంటి పరిసర ప్రాంతాలలో కనీసం మూడు మొక్కలనైనా నాటి పెంచి పెద్ద చేయాలని సూచించారు.ప్రభుత్వ సేవకులపై ఎల్లప్పుడూ ఆధార పడకుండా తమ వీధులను తాము శుభ్ర పరుచుకునే శ్రమదానం నెలలో ఒక్కసారైనా చేయాలని పిలుపునిచ్చారు.జిల్లా అటవీ శాఖ అధికారి నిఖిల్ రెడ్డి  మాట్లాడుతూ.. మన జిల్లా సస్యశ్యామలంగా ఉండాలంటే ప్రధానంగా నీటి వనరులకోసం భూగర్భ జలాలను పెంచుకోవాలని అన్నారు. అందుకు చెట్లను పెంచడమే అసలైన మార్గమని పేర్కొన్నారు.ప్రతి ఇంటికి ఇంకుడుగుంటలు ఉండాలని అన్నారు.అనంతరం అధికారులు,ఉద్యోగులు సామాజిక కార్యకర్తలు మున్నగువారు పర్యావరణ అవగాహన ర్యాలీ ఏకో పార్క్ నుండి  మర్రికుంట  వరకు నిర్వహించారు. కార్యక్రమంలో  వనపర్తి అదనపు కలెక్టర్, యాదయ్య,  వనపర్తి డిఎస్పి, వెంకటేశ్వరరావు, మున్సిపల్ కమిషనర్, వెంకటేశ్వర్లు, అటవీ శాఖ ఫారెస్ట్ రేంజ్ అధికారి, నిఖిల్ రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ సిఐ, నరేష్,వనపర్తి సీఐ, కృష్ణయ్య రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, శ్రీనివాస్, అప్పలనాయుడు, నిస్వార్థ ఆర్గనైజేషన్ సభ్యులు, స్నేక్ సొసైటీ సభ్యులు, అటవీ శాఖ అధికారులు,సిబ్బంది, పోలీస్ అధికారులు, సిబ్బంది, మున్సిపల్ అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.