Take a fresh look at your lifestyle.

రాబోయే పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా నగరపాలక సంస్థ నుండి అవసరమైనఏర్పాట్లు చేయండి…

 

*మేయర్ కోలగని శ్రీనివాస్ తో బిజెపి మైనార్టీ మోర్చా నేతలు….

రాబోయే పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని కరీంనగర్ నగరంలో అవసరమైన సదుపాయాలు కల్పించాలని కోరుతూ బుధవారం రోజున కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ కొలగాని శ్రీనివాస్ కు బిజెపి మైనార్టీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ ముజీబ్,రాష్ట్ర ఉపాధ్యక్షుడు మొహమ్మద్ బషీరుద్దీన్ ,
జిల్లా ప్రధాన కార్యదర్శి సమీయుల్లా అహ్మద్,
రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ సిద్దిక్ లు వినతి పత్రం అందజేశారు. కరీంనగర్ లోని మస్జిద్ పరిసర ప్రాంతాలు, మైనారిటీ వార్డుల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని కోరారు. రమజాన్ సందర్భంగా మస్జిద్‌ల వద్ద సరైన వీధి దీపాలు, పరిశుభ్రత, ఇఫ్తార్ అనంతరం చెత్త తొలగింపు, తగినంత నీటి సరఫరా, సేహరీ సమయాల్లో హోటళ్లను ఆలస్యంగా నిర్వహించేందుకు అనుమతి, తరావీహ్ నమాజ్ సమయంలో అవసరమైతే తాత్కాలిక రహదారి మూసివేతలు, భద్రతా ఏర్పాట్లు పెంపు మరియు దెబ్బతిన్న రహదారులు, డ్రైనేజ్ మరమ్మతులు చేయాలని కోరారు.
పవిత్ర రమజాన్ మాసం శాంతియుత వాతావరణంలో జరగడానికి మున్సిపల్ యంత్రాంగం తగిన చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.

Leave A Reply

Your email address will not be published.