Take a fresh look at your lifestyle.

పల్నాడు ఎక్స్ ప్రెస్ ట్రైన్ తాండూర్ వరకు పొడిగించాలి -ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డిని కలిసిన తాండూర్ పట్టణ బిజెపి కౌన్సిలర్లు

ముద్ర, తాండూర్:

వికారాబాద్ రైల్వే స్టేషన్ వరకు వచ్చేపల్నాడు ఎక్స్ ప్రెస్ ట్రైన్ తాండూర్ రైల్వే స్టేషన్ వరకు పొడిగించగలరని తాండూర్ ప్రజలు విజ్ఞప్తి మేరకు తాండూర్ పట్టణ బిజెపి కౌన్సిలర్లు ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డిని ని కోరడం జరిగింది. అందుకు ఎంపీ సానుకూలంగా స్పందిస్తూ వెంటనే సౌత్ సెంట్రల్ రైల్వే కు రిక్వెస్ట్ లెటర్ కూడా రైల్వే శాఖకు పంపించడం జరిగింది. దాంతోపాటు నిన్న ఫ్లోర్ లీడర్ గా నియమించబడ్డ నాగారం మల్లేశం గారిని చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి గారు సన్మానించడం జరిగింది. దాంతోపాటు మున్సిపల్ ఎలక్షన్స్ లో మాట ఇచ్చిన ప్రకారం గెలుపొందిన ముగ్గురు కౌన్సిలర్లకు ఎంపీ నిధుల ద్వారా ముగ్గురు కౌన్సిలర్లు కు వార్డుకు 10లక్షల రూపాయలు వార్డ్ డెవలప్మెంట్ ఫండ్ శాంక్షన్ చేసి ఇవ్వడం జరిగింది. అందుకు సహకరించిన చేవెళ్ల ఎంపీ గారికి తాండూరు బిజెపి పట్టణ శాఖ తరపున,తాండూరు ప్రజల తరఫున వార్డ్ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది. కార్యక్రమంలో 28వ వార్డు కౌన్సిలర్ నాగారం మల్లేశం, 23 వ వార్డు కౌన్సిలర్ అంతారం కిరణ్, 33 వ వార్డు కౌన్సిలర్ శ్రీకాంత్ రెడ్డి తదితరులు ఎంపీని కలిసిన వారిలో ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.