- వైభవంగా ‘శ్రీలక్ష్మి నారాయణ హవనం’
ముద్ర, న్యూస్ బ్యూరో: హైదరాబాద్: అక్షయ తృతీయ పర్వదినం సందర్భంగా అమ్మవారి కటాక్ష సిద్ధి కోసం శ్రీరంగగిరిలో ‘శ్రీలక్ష్మి నారాయణ హవనం’ నిర్వహించారు.వరంగల్ గీతాభవనం యాఙ్ఞిక స్వామి శ్రీమాన్ వెంకటకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈ విశిష్ట హవన క్రతువు సంప్రదాయబద్ధంగా, వైభవపేతంగా జరిగింది. హవనంలో పాల్గొన్న వారికి వైదిక మంత్రార్చితమైన లక్ష్మీనారాయణుల వెండి నాణేన్ని యఙ్ఞఫలప్రసాదంగా అందజేశారు. ఈ క్రతువులో పాల్గొన్న అందరికీ స్వామి దివ్యానుగ్రహంతో అఖండ ఐశ్వర్వ సిద్ధి కలగాలని మనసారా ప్రార్థిస్తున్నట్టు శ్రీ రామానుజ సేవా ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ ధనుంజయ్ తెలిపారు.

- *ఎంబిబిఎస్ విద్యార్థినికి ఫీజు కోసం రూ, లక్ష సాయం*
ఎంబిబిఎస్ మూడో సంవత్సరం చదువుతున్న దళిత పేదింటి వైద్యవిద్యార్థిని చెంచల రాధికకు ఈ ఏడాది ఫీజుకిగాను శ్రీరామానుజ సేవాట్రస్టు ద్వరా లక్ష రూపాయల చెక్కును అందజేయడం జరిగింది.అక్షయ తృతీయ సందర్భంగా ఈ చెక్కును అందుకోవడం ఎంతో శుభ ప్రదంగా అనుభూతి చెందుతున్నానని రాధిక ఎంతో ఎమోషనల్ గా చెప్పింది.ఈ అమ్మాయి భవిష్యత్తులో తన లక్ష్యాన్ని సాధించి, అత్యున్నత స్థాయికి చేరుకోవాలని ఆ రంగనాథుని ప్రార్థిస్తున్నామని డాక్టర్ ధనంజయ్ అన్నారు.
