Take a fresh look at your lifestyle.

సింగిల్​ బెంచ్​ లోనే తేల్చుకోండి.

  • గ్రూప్​ 1 నియామకాల అంశంపై టీజీపీఎస్సీకి హైకోర్టు షాక్​.
  • మధ్యంతర ఉత్తర్వులు పునఃసమీక్షించండి.
  • సింగిల్ బెంజ్ జడ్జికి హైకోర్టు ఆదేశం.

ముద్ర, తెలంగాణ బ్యూరో : గ్రూప్-1 నియామకాల విషయంలో టీజీపీఎస్సీకి తెలంగాణ హైకోర్టులో షాక్ తగిలింది. రాష్ట్రంలో గ్రూప్-1 నియామకాల విషయంలో సింగిల్ బెంచ్ ధర్మాసనం ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ టీజీపీఎస్సీ దాఖలు చేసిన అప్పీల్ ను సీజే ధర్మాసనం తోసిపుచ్చింది.గ్రూప్- 1 నియామకాల్లో అక్రమాలు జరిగాయని కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు.మెయిన్స్ పరీక్షల మూల్యాంకనం సరిగా చేయలేదని, పరీక్ష కేంద్రాల కేటాయింపులోనూ నిబంధనలు పాటించలేదని పిటిషనర్లు కోర్టును ఆశ్రయించారు.దీనిపై ఇటీవల విచారణ జరిపిన జస్టిస్ నామవరపు రాజశ్వరరావు ధర్మాసనం నియామకాలను తాత్కాలికంగా నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ధ్రువపత్రాల పరిశీలన మాత్రం చేసుకోవచ్చని అవకాశం కల్పించారు.ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పిటిషన్ దాఖలు చేయగా దీనిపై బుధవారం హైకోర్టు సీజే ధర్మాసనం విచారణ చేపట్టింది. సింగిల్ బెంచ్ ఉత్తర్వులను రద్దు చేయాలని టీజీపీఎస్సీ తరఫున న్యాయవాది కోర్టును కోరగా దీనికి సీజే ధర్మాసనం నిరాకరించింది.సింగిల్ బెంచ్ లో విచారణ ఉన్న నేపథ్యంలో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. సింగిల్ బెంచ్ లోనే తేల్చుకోవాలని స్పష్టం చేసింది. మధ్యంతర ఉత్తర్వులను పునఃసమీక్షించాలని సింగిల్ బెంజ్ జడ్జికి ఆదేశించింది.

Leave A Reply

Your email address will not be published.