మల్యాల, ముద్ర విలేకరి:రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి అనుకూల వాతావరణం ఉందని బీజేపీ మండల అధ్యక్షుడు గాజుల మల్లేశం అన్నారు. బుధవారం స్థానిక సంస్థల ఎన్నికల కార్యశాల ఏర్పాటు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపిటిసి, జడ్పిటిసి సీటు కైవసం చేసుకోవాలని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి బత్తుల లక్ష్మీనారాయణ అధ్యక్షతన బీజేపీ – స్థానిక సంస్థల ఎన్నికల కార్యశాల నిర్వహించింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలలో విఫలం, కాంగ్రెస్ పార్టీ హామీల పైన ఇంటింటికి ప్రచారం చేయాలని పార్టీ నేతలకు సూచించారు. గత, ప్రస్తుత ప్రభుత్వాలపై ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని వ్యాఖ్యానించారు. ఈసారి బీజేపీని కోరుకుంటున్నారనీ స్పష్టం చేశారు. ప్రజల ఆకాంక్షల మేరకు పార్టీ కార్యకర్తలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బింగి వేణు, సంఘని రవి, రాచర్ల రమేష్, కిల్లేటి రమేష్, ముదిగంటి రాజు, బొట్ల ప్రసాద్, పిల్లి రాజశేఖర్, పొనగంటి గౌతమ్, కర్బుజా చక్రం గౌడ్, జనగం రాములు, కటకం లత,అవుదుర్తి రమ, కట్ట జ్యోతి, హర్షవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.