Take a fresh look at your lifestyle.

పాఠశాలలో ఉచిత దంత వైద్య పరీక్షలు

గొల్లపల్లి, ముద్ర విలేకరి: జగిత్యాల జిల్లా లోని గొల్లపల్లి మండలంలోని మల్లన్నపేట గ్రామంలోని ఉన్నత పాఠశాలలో శీను నాయక్ డెంటల్ హాస్పిటల్ డాక్టర్ రాజు ఆధ్వర్యంలో బుధవారం రోజు విద్యార్థులకు ఉచిత దంత వైద్య పరీక్షలు నిర్వహించారు.ఈ సందర్భంగా డాక్టర్ రాజు మాట్లాడుతూ, పిల్లలందరూ దంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, రోజుకు రెండు సార్లు బ్రష్ చేసుకోవాలని ఆయన తెలిపారు. అలాగే అతిచల్లటి పదార్థాలను, అతివేడి పదార్థాలను అసలే తీసుకోరాదని తెలుపుతూ, విద్యార్థులందరికీ దంతాల సంరక్షణ పట్ల సంపూర్ణమైన అవగాహన కల్పించారు. వైద్య పరీక్షల అనంతరం విద్యార్థులందరికీ అవసరమైన మందులను, బ్రష్, పేస్టులను ఉచితంగా అందించారు.ఈ కార్యక్రమని ఏర్పాటుకు సహకరించిన పాఠశాల ఉపాధ్యాయ బృందానికి ధన్యవాదాలు ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు యాళ్ళ అమర్ నాథ్ రెడ్డి, ఉపాధ్యాయులు కర్ణాకర్, రాజేశం, హరికృష్ణ, సత్య, రవీందర్, బాలచంద్రుడు, చంద్రశేఖర్, శరత్ చందర్, విజయ, ప్రకాష్, స్రవంతి, నందయ్య రాజనర్సయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.