Take a fresh look at your lifestyle.

చిరుత పులి సంచారం భయాందోళనలో ప్రజలు

వికారాబాద్, ముద్ర విలేకరి : వికారాబాద్ జిల్లాలోని కుల్కచర్ల అటవీ ప్రాంతంలో చిరుత పులి సంచరించడంతో పరిసర గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.గత మూడు రోజులుగా చిరుత పశువులను చంపి తింటుందని ప్రజలు వాపోయారు. రైతు వెంకటయ్య తన పొలం వద్ద కట్టేసి ఉన్న లేక దూడపై చిరుత దాడి చేసి తిన్నదని వారు తెలిపారు.గురువారం ఉదయం పొలం వద్దకు వెళ్లి చూడగా సిద్ధార్థ దాడిలో లేక దూడ చనిపోయినట్లు గుర్తించామని వారు తెలిపారు.చిరుత సంచారం పై ఇదివరకే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చామని ఇప్పటివరకు వారు ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు.ఇప్పటికైనా అటవీశాఖ అధికారులు చొరవ తీసుకొని చిరుతను పట్టుకొని ప్రజలను కాపాడాలని వారు కోరారు.

Leave A Reply

Your email address will not be published.