Take a fresh look at your lifestyle.

సావిత్రి భాయి పూలే ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. -బిఆర్ఎస్ ఎస్ రాష్ట్ర అధ్యక్షుల శ్రీనివాస్ గౌడ్.

 ముద్ర,మోత్కూరు:

బాలికల విద్యా కోసం, వింతంతుల మహిళల అభ్యున్నతి కొరకై నిరంతరం కృషి చేసిన బడుగు,బలహీనవర్గాల ఆశాజ్యోతి సావిత్రిబాయి పూలే ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని బీసీ రిజర్వేషన్ సాధన సమితి (బిఆర్ఎస్ఎస్) రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు బుర్ర శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. మంగళవారం సావిత్రిబాయి పూలే 129వ, వర్ధంతి సందర్భంగా స్థానిక శ్రీకాంతాచారి చౌరస్తా వద్ద ఆమె చిత్రపటానికి బీసీ రిజర్వేషన్ సాధన సమితి ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈసందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ తన భర్త జ్యోతిరావు పూలే విద్యను అభ్యసించి భారతదేశంలో మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా పని చేశారని, ఆమె ఒక గొప్ప సంఘ సంస్కర్త అని పేర్కొన్నారు. బాలికల, మహిళ కోసం నిరంతరం పాటుపడిన ఆమె మహిళ లోకానికి స్ఫూర్తిదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ రిజర్వేషన్ సాధన సమితి జిల్లా కార్యదర్శి. పోతగాని మల్లేశం, నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి నోముల రమేష్ నేత ,పట్టణ అధ్యక్షులు నిలిగొండ మత్స్యగిరి , మాజీ సర్పంచ్. బయ్యని పిచ్చయ్య, నాయకులు సంగిశెట్టి రూబెన్, తీగల నర్సింహ్మ ,అల్లే యాదయ్య, బాబురావు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.