- ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి
ముద్ర ప్రతినిధి, కల్వకుర్తి: వేసవిలో అనుకోకుండా అగ్గిరాజుకుని ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నందున సంబంధిత శాఖ అప్రమత్తంగా ఉండాలని ఎక్కడైనా ప్రమాదం జరిగితే తక్షణమే స్పందించి నష్టాన్ని నివారించేందుకు ప్రయత్నం చేయాలని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు.ఆదివారం కల్వకుర్తి పట్టణంలోని అగ్నిమాపక కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి యంత్రాల పనితీరును సిబ్బంది వివరాలు తదితర అంశాలను తెలుసుకొని మాట్లాడారు ప్రజలు ఎక్కడ ప్రమాదం జరిగిన 101 కి సమాచారం ఇవ్వాలని సూచించారు.ప్రమాదం జరిగిన ప్రారంభంలోనే అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇస్తే నష్టాన్ని తగ్గించుకునే అవకాశం ఉంటుందని ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ఈ నెలలో 14 నుంచి జరిగే అగ్నిమాపక వారోత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు