- పేద విద్యార్థుల అభ్యున్నతికి ఎల్లవేళలా కృషి చేస్తా.
- మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్.
తుంగతుర్తి, ముద్ర: తుంగతుర్తి మండలం గొట్టిపర్తి గ్రామానికి చెందిన బుద్ధ కనక శ్రీ హైదరాబాదులోని జేఎన్టీయూలో బీటెక్ రెండవ సంవత్సరం చదువుతూ ఆర్థిక ఇబ్బందులు పడుతున్న తీరు కు స్పందించిన తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ లక్ష రూపాయల విలువచేసే లాప్టాప్ 30,000 రూపాయలు నగదును ఆదివారం అందజేశారు.ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ రైజ్ ఇండియా ఇండియా స్వచ్ఛంద సంస్థ వారి సహకారంతో వారికి సహాయ సహకారాలు అందించామని అలాగే వారి ఉన్నత విద్య సైతం స్వచ్ఛంద సంస్థ తోడుగా ఉంటుందని తెలిపారు.నిరుపేద విద్యార్థులు ఇలాంటి అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత చదువుల్లో బాగా రాణించాలని మంచి ఉద్యోగాలు పొందాలని అన్నారు.ఏ ప్రాంతం వారైనా పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించడంలో తాము ఎల్లవేళలా ముందుంటామని అన్నారు.విద్యార్థిని కనకశ్రీకి మూడు సంవత్సరాల మెస్ చార్జీలు చెల్లించడానికి తాము పూర్తి బాధ్యత తీసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు మాజీ ఎంపీపీ తాటికొండ సీతయ్య, జిల్లా నాయకులు గుండగానీ రాములు గౌడ్ రమేష్ గౌడ్ గోపగాని శ్రీనివాస్ లతోపాటు పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.