Take a fresh look at your lifestyle.

శివారు కాలనీల్లో పనులను పూర్తి చేయాలని కమిషనర్ ను ఆదేశించిన పీయేసీ ఛైర్మన్

మాదాపూర్, ముద్ర విలేఖరి: కూకట్పల్లి సర్కిల్ పరిధిలోని కూకట్పల్లి (పార్ట్), వివేకానంద నగర్, ఆల్విన్ కాలనీ, హైదర్ నగర్ డివిజన్లలో నెలకొన్న పలు సమస్యలు మరియు చేపట్టవలసిన పలు అభివృద్ధి పనులు, పెండింగ్ లో ఉన్న పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని జోనల్ కమిషనర్ అపూర్వ చౌహాన్ ను పీయేసీ ఛైర్మన్ అరికెపూడి గాంధీ ఆదేశించారు. కూకట్పల్లి జోన్ జోనల్ కార్యాలయంలో జోనల్ కమిషనర్ అపూర్వ చౌహన్, డీసీ గంగాధర్ ను కలిసి శేరిలింగంపల్లి నియోజకవర్గం కూకట్పల్లి సర్కిల్ పరిధిలోని కూకట్పల్లి (పార్ట్), వివేకానంద నగర్, ఆల్విన్ కాలనీ, హైదర్ నగర్ డివిజన్లలో నెలకొన్న పలు సమస్యలు మరియు పలు అభివృద్ధి పనుల పై గాంధీ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ గాంధీ మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గం కూకట్పల్లి సర్కిల్ పరిధిలోని కూకట్పల్లి (పార్ట్), వివేకానంద నగర్,హైదర్ నగర్, ఆల్విన్ కాలనీ డివిజన్ల లో నెలకొన్న పలు సమస్యలు మరియు చేపట్టవల్సిన పలు అభివృద్ధి పనుల పై మాట్లాడుతూ వర్షాకాలం ను దృష్టిలో పెట్టుకొని పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాలని, ప్రజలకు ఎరువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్ విభాగం మరియు అన్ని విభాగాల అధికారులు కలిసి సమన్వయంతో పనిచేయాలన్నారు. ప్రజా సమస్యల పై అధికారులు నిర్లిప్తతను విడాలని, మీ దృష్టికి ప్రజల నుండి వచ్చిన ప్రజా సమస్యల పై స్పందించే అవసరం ఎంతైనా ఉంది అని, జి.హెచ్.ఎం.సి అధికారులు మరియు అన్ని విభాగాల అధికారులు సమన్వయం తో పనిచేస్తూ ప్రజా సమస్యలే పరిష్కార ధ్యేయంగా ముందుకు వెళ్లాలని, ప్రజావసరాల దృష్ట్యా కాలనీ లలో నెలకొన్న రోడ్ల సమస్యలను ప్రథమ ప్రాధాన్యత గా పరిగణలోకి తీసుకోని త్వరిత గతిన పరిష్కారం అయ్యేలా కృషి చేయాలని, మంజీర రోడ్డు నిర్మాణం పనులలో వేగం పెంచాలని, అలసత్వం ప్రదర్శిచకూడదని, అవసరం ఉన్న చోట కొత్త ప్రతిపాదనలు తీసుకోవాలని, మంజూరైన అభివృద్ధి పనులకు త్వరలోనే ప్రారంభించేల చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. వర్షాకాలం ను దృష్టిలో పెట్టుకొని లోతట్టు ప్రాంతాల పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని మాన్ సున్ ఎమర్జెన్సీ టీమ్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్ సిబ్బంది ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండలని, గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని లోతట్టు ప్రాంతాలు, నీరు నిల్వ ప్రాంతాలను గుర్తించి ప్రజలకు ఇబ్బంది కల్గకుండా, నాలలలో పేరుకుపోయిన చెత్త చెదారం ను తొలగించి నీటి ప్రవాహం సాఫీగా సాగేలా చూడాలని, సమీక్ష సమావేశంలో ఇంజనీరింగ్ విభాగం అధికారులు ఈఈ గోవర్ధన్, కిష్టప్ప, ఆనంద్, రాజీవ్, నిఖిల్, శ్రావణి, సాయి ప్రసన్న మరియు తదితరులు పాల్గొన్నారు. సి.ఎం.ఆర్.ఎఫ్ చెక్ అందచేసిన ఛైర్మన్ ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని శంషిగుడా కి చెందిన కట్ట ప్రసాద్ రావు వైద్య చికిత్స నిమిత్తం ముఖ్య మంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకొనగా సి.ఎం.ఆర్.ఎఫ్ ద్వార మంజూరైన రూ.40,000 నలబై వేల రూపాయల ఆర్థిక సహాయానికి సంబంధించిన చెక్కును కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావుతో కలిసి బాధిత కుటుంబానికి అందచేసిన చైర్మన్ శ్రీ ఆరెకపూడి గాంధీ.

Leave A Reply

Your email address will not be published.