ముద్ర ప్రతినిధి, భువనగిరి :
మూసీ విషపు జలాల నుండి పోచంపల్లి ప్రాంత ప్రజలను, రైతులను విముక్తి కల్పించడానికి కొండపోచమ్మ ప్రాజెక్టు నుండి శామీర్ పేట చెరువులోకి గోదావరి జలాలు తెచ్చి షామీర్ పేట చెరువు నింపి ఆచెరువు నుండి ఘట్కేసర్ మండలం ఏదులబాద్ చెరువు ద్వారా మూసీ కావలోకి గోదావరి జలాలు మల్లించి పోచంపల్లి ప్రాంతంలోని రైతాంగానికి సాగునీరు అందించాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ్మ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పోచంపల్లి పట్టణ పరిధిలోని నారాయణగిరిలో ఇంటింటికి సీపీఎం కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నర్సింహ పాల్గొని మాట్లాడుతూ పోచంపల్లి ప్రాంతం మూసీ విషపు జలాలతో భూములు మొత్తం ధ్వంసంమై ఎలాంటి పంటలు పండకుండ ఎడారిగా మారే ప్రమాదం ఉన్నదని ఆవేదన వెలిబుచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాటూరి బాలరాజు, మాజీ డివిజన్ కార్యదర్శి గూడూరు అంజిరెడ్డి, మండల కార్యదర్శి కోట రామచంద్రారెడ్డి, మాజీ జిల్లా కమిటీ సభ్యులు పగిళ్ల లింగారెడ్డి, టౌన్ కార్యదర్శి దుబ్బాక జగన్, మండల కార్యదర్శివర్గ సభ్యులు మంచాల మధు, శాఖ కార్యదర్శి గూడూరు రాంరెడ్డి, టౌన్ కమిటీ సభ్యులు వడ్డెపల్లి యాదగిరి, నాయకులు గూడూరు క్రిష్ణా రెడ్డి, సామల సత్తిరెడ్డి, రామస్వామి అంజిరెడ్డి పాల్గొన్నారు.
Naresh is a Asst Editor and he is working with our organisation and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.