Take a fresh look at your lifestyle.

నిరంతర సాధనే విద్యార్థుల విజయానికి తొలిమెట్టు

  • కోరుట్ల సర్కిల్ ఇన్స్పెక్టర్ సురేష్ బాబు.

కోరుట్ల, ముద్ర: కోరుట్ల రామక్రిష్ణ డిగ్రీ, పిజి కళాశాలలో విద్యార్థుల వీడ్కోలు వేడుకలు”విగమ 2025″ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోరుట్ల సీఐ బి. సురేష్ బాబు పాల్గొనగా విద్యార్థులు పూల మొక్క ఇచ్చి స్వాగతం పలికారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణగా ఉంటూ, ఉన్నత విద్యను చదివి సమాజంలో మార్పు తీసుకు రావాలని, నిరంతర సాధన ద్వారా విజయం సాధించవచ్చని విద్యార్థులకు దిశానిర్దేశనం చేశారు. కన్న తల్లిదండ్రుల ఆశయాలు నెరవేర్చే విధంగా చదువు పై దృష్టి సారించి, సమాజంలో మీకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలని సూచించారు.చెడు అలవాట్లకు దూరం ఉండాలన్నారు.అనంతరం కళాశాల బృందం సీఐ శాలువాతో సత్కరించారు.విద్యార్ధులు చేసిన నృత్యాలు ఆహుతులను అలరించాయి. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ గాడిపెళ్లి హరిప్రియ అంజయ్య గౌడ్, ప్రిన్సిపాల్ బెజ్జారపు ప్రవీణ్ కుమార్, అధ్యాపకులు, అధిక సంఖ్యలో విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.