ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మంగళవారం ఉదయం బేగంపేట కిమ్స్ ఆస్పత్రి కి వెళ్లారు. సంధ్య థియేటర్ ఘటనలో గాయపడ్డ శ్రీతేజ్‌ను పరామర్శించారు. అయితే పోలీసుల సూచనల ప్రకారం ముందుగా వారికి సమాచారం ఇచ్చి ఆయన ఆస్పత్రికి బయలుదేరి వెళ్ళారు. గత 35 రోజులుగా కిమ్స్ ఆస్పత్రిలోనే శ్రీతేజ్ చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. పోలీసుల అనుమతితో అల్లు అర్జున్ కిమ్స్ ఆసుపత్రికి వచ్చారు.
ఈ క్రమంలో కిమ్స్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. మరోవైపు ప్రముఖ నిర్మాత దిల్ రాజు కూడా కిమ్స్ ఆస్పత్రికి వచ్చారు. కాగా అల్లు అర్జున్‌కు హైదరాబాద్, రాంగోపాల్‌పేట్ పోలీసులు మరోసారి నోటీసులు అందించారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో గాయపడి కిమ్స్ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న శ్రీతేజ్‌ను పరామర్శించాలంటే ముందుగా తమకు సమాచారం ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. బాలుడిని చూసేందుకు ఎప్పుడు రావాలనుకున్నా.. ముందుగానే ఇన్‌ఫర్మేషన్ ఇవ్వాలని, ఆ తర్వాత మాత్రమే అక్కడికి వెళ్లాలని సూచించారు.