ముద్ర ప్రతినిధి, నిర్మల్:
నిర్మల్ పట్టణంలో నూతనంగా నిర్మించబోయే ఈద్గా స్థలాన్ని మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి, అర్జుమంద్ అలీ పరిశీలించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో ఈద్గా కోసం వక్ఫ్ బోర్డు 5.01 ఎకరాల భూమిని కేటాయించింది.ఈ సందర్బంగా అక్కడ చేపట్టబోయే పనులను పరిశీలించి అవసరమైన సూచనలు చేశారు. వీరితో పాటు మున్సిపల్ కౌన్సిలర్లు మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు.