ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్:
నాగర్ కర్నూల్: శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని రాంనగర్ కాలనీలో ఉన్న శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో జరిగే కళ్యాణోత్సవం అనంతరం భక్తులకు అన్నప్రసాద పంపిణీ నిర్వహించనున్నట్లు మున్నూరు కాపు తాలూకా సంఘం ప్రతినిధులు తెలిపారు.
సంఘం తాలూకా అధ్యక్షుడు తీగల సుభాష్, కార్యదర్శి పాలమూరు సతీష్, కోశాధికారి తీగల జగదీష్ మాట్లాడుతూ గత మూడు సంవత్సరాలుగా శ్రీరామనవమి సందర్భంగా టీటీడీ కళ్యాణ మండపంలో భక్తులకు ఉచితంగా అన్నప్రసాదం పంపిణీ చేస్తున్నామని తెలిపారు.
ఈ సంవత్సరం సుమారు 6 వేల మందికి పైగా భక్తులకు సంపూర్ణ అన్నప్రసాదం అందజేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణం అనంతరం భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించాలని వారు కోరారు.
మరిన్ని వివరాలకు 9985221162, 9966671731 నంబర్లను సంప్రదించాలని సూచించారు.