Take a fresh look at your lifestyle.

అదనపు ఎస్పీగా విక్రాంత్ కుమార్ సింగ్ బాధ్యతలు

ముద్ర ప్రతినిధి మెదక్:
మెదక్ జిల్లా అదనపు ఎస్పీగా విక్రాంత్ కుమార్ సింగ్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుండి బదిలీపై వచ్చారు.
ఈ సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో గార్డ్ ఆఫ్ ఆనర్‌ను స్వీకరించారు. అనంతరం ఆయన అధికారులతో సమావేశమై జిల్లాలోని శాంతిభద్రతల పరిస్థితులపై జిల్లా అధికారుల నుండి వివరాలు తెలుసుకున్నారు. ప్రజల భద్రత, చట్టసంరక్షణలో మరింత సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు. ప్రజలతో స్నేహపూర్వకంగా వ్యవహరించి సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేయాలని తెలిపారు. డీఎస్పీలు ప్రసన్న కుమార్, నరేందర్ గౌడ్, సుభాష్ చంద్రబోస్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.