Take a fresh look at your lifestyle.

మీలోని ప్రతిభను గుర్తించుకొని, సమాజానికి సేవ చేసే మార్గాన్ని ఎంచుకోవాలి

  • కాట సుధా శ్రీనివాస్ గౌడ్.

ముద్ర, శేరిలింగంపల్లి -విలేకరి: మీలోని ప్రతిభను గుర్తించుకొని, సమాజానికి సేవ చేసే మార్గాన్ని ఎంచుకోవాలని మీరు చేసే ప్రతి పని సామాజిక పట్ల గౌరవంతో ఉండాలి,” అని సంగారెడ్డి జిల్లామహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాట సుధా శ్రీనివాస్ గౌడ్ అన్నారుశనివారం నాడు చందానగర్ లోని ప్రముఖ విద్యాసంస్థలు MNR స్కూల్ లో ఇన్వెస్టిచర్ సెరిమనీ కార్యక్రమాన్ని అత్యంత ఉత్సాహంగా నిర్వహించారు.ఈ వేడుకలకు సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాట సుధా శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై, విద్యార్థి నాయకులకు ప్రమాణస్వీకారం చేయించి, జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా కాట సుధ మాట్లాడుతూ “నాయకత్వం అనేది కేవలం పదవికాదు, అది బాధ్యత. మీలోని ప్రతిభను గుర్తించుకొని, సమాజానికి సేవ చేసే మార్గాన్ని ఎంచుకోవాలి. మీరు చేసే ప్రతి పని సామాజిక పట్ల గౌరవంతో ఉండాలి,” అని ఆమె తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.