ముగిసిన మున్సిపల్ ఎన్నికలు.-
నువ్వా… నేనా గెలుపుపై ఎవరి ధీమా వారిది.
-ఓటర్లకు మందు, మాంసం, డబ్బు, చీరలు పంపిణీ.
-బాక్స్ లలో దాగి ఉన్న అభ్యర్థుల భవితవ్యం.
మోత్కూర్ ముద్ర న్యూస్:
మున్సిపల్ ఎన్నికల లో భాగంగా ఎన్నికల బరిలో నిలిచిన వివిధ పార్టీల అభ్యర్థులు గెలుపు తమదంటే తమదేనని ధీమాగా ఉన్నారు. ఓటర్ల కు మందు, మాంసం, డబ్బు, మహిళలకు చీరలు పంపిణీ చేసి మీ ఓటు మాకు అంటే మాకే వెయ్యాలని అభ్యర్థులు ఒకరికి ఒకరు పోటీపడి మరి పంపిణీ చేశారు. ఇతర ప్రాంతాలలో ఉన్నటువంటి ఓటర్లకు చార్జీలు చెల్లించి మరి పిలిపించుకొని తమ ఓట్లను అభ్యర్థించారు. గెలుపు తమదంటే తమదేనని ధీమాగా ఉన్నారు. ఏది ఏమైనా బ్యాలెట్ బాక్స్ లలో నే అభ్యర్థుల బౌతవ్యం దాగి ఉన్నదని అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందా లేక బిఆర్ ఎస్,బిజెపి విజయం సాధిస్తుందా అని ఓటర్లు గుస గుసలు ఆడుతున్నారు.