ప్రైవేట్ ట్రస్ట్ కు కేటాయించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను వెనక్కి తీసుకోవాలి.. . జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన తాండూర్ పట్టణ బిజెపి నాయకులు
ముద్ర, తాండూర్:
ప్రభుత్వ సంక్షేమ ఫలాలు పేద ప్రజలకు అందించడమే ప్రభుత్వ ధ్యేయంగా ఉండాలే తప్ప ప్రైవేట్ వ్యక్తులకు అందించడంలో అంతర్యం ఏమిటని తాండూర్ పట్టణ బిజెపి నాయకులు డిమాండ్ చేశారు. హైదరాబాద్ రోడ్డు మార్గంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఎస్ జి ఎం కె అనే ప్రైవేట్ వ్యక్తికి చెందిన ట్రస్టుకు అప్పగించడం చట్టరీత్య నేరమని వారు పేర్కొన్నారు. ఒకే వర్గానికి చెందిన వ్యక్తులకు ఇళ్ళను కేటాయించడం ఎంతవరకు సమంజసం అని, కేవలం ఒకే వర్గంలో పేద ప్రజలు ఉంటారా, మిగతా వర్గంలో పేదలు లేరా అని వారు నిలదీశార. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రైవేట్ ట్రస్టుకు జోక్యం లేకుండా ఇళ్ళను వెనక్కి తీసుకొని నిజమైన పేద ప్రజలకు, కుల మతం భేదం లేకుండా ఇళ్లను కేటాయించాలని, వికారాబాద్ జిల్లా కలెక్టర్ దీపక్ తివారి కి ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా ప్రభుత్వ కార్యకలాపాల్లో ప్రైవేట్ ట్రస్ట్ జోక్యం చేసుకున్నందుకు ఈ ట్రస్ట్ పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ బాలేశ్వర్ గుప్తా, జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణ ముదిరాజ్, రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు సాహు శ్రీలత, మాజీ కౌన్సిలర్ అంతారం లలిత, పట్టణ అధ్యక్షులు నగరం మల్లేశం, కౌన్సిలర్ శ్రీకాంత్ రెడ్డి, జిల్లా కార్యదర్శి బంటారం భద్రేశ్వర్, పట్టణ ఉపాధ్యక్షులు దోమ కృష్ణ నాయకులు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.