ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి :
రాయగిరి సెక్టార్ పరిధిలోని హన్మాపురం, బస్వాపురం, రాయగిరి, యూసుఫ్ నగర్ అంగన్వాడీ కేంద్రాలలో మంగళవారం పోషణ్ పఖ్వాడాలో భాగంగా ప్రీ–స్కూల్ పిల్లల గ్రాడ్యుయేషన్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా హన్మాపురం గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలోసర్పంచ్ నాగపురి సువర్ణ కృష్ణ మాట్లాడారు. 3 నుండి 6 ఏళ్ల లోపు పిల్లలను ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా అంగన్వాడీ కేంద్రాల్లోనే చేర్పించాలని తల్లులకు అవగాహన కల్పించారు. కేంద్రాల్లో లభించే పౌష్టికాహారం, విద్యాబోధన చిన్నారుల సర్వతోముఖాభివద్ధికి దోహదపడుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు, తల్లులు పాల్గొన్నారు.