Take a fresh look at your lifestyle.

నారాయణపేటలో పుర పోరు ప్రశాంతం

ఓటు హక్కు వినియోగించుకున్న 26వేల 34 మంది ఓటర్లు

పురుషులు 12,948 మంది…మహిళలు 13,356

పోలింగ్ శాతం 74.18 నమోదు

ఓటింగ్ సరళిని పరిశీలించిన కలెక్టర్… బందోబస్తు పర్యవేక్షించిన ఎస్పీ

కుటుంబ సమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్న మాజీ డిసిసి అధ్యక్షులు

అత్యధికంగా 10 వ వార్డులో… అత్యల్పంగా 7 వ వార్డులో పోలింగ్ నమోదు…

ముద్ర, నారాయణపేట:

నారాయణపేట పట్టణంలో పురపోరు ప్రశాంతంగా ముగిసింది. పట్టణంలో 24 వార్డులు ఉండగా 56 పోలింగ్ బూతులను ఏర్పాటు చేశారు. 24 వార్డులకు గాను 35 వేల 460 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 17,244 మంది పురుషులు… 18216 మంది మహిళలు ఉన్నారు. పోలింగ్ రోజు నారాయణపేట మున్సిపాలిటీ పరిధిలో 26 వేల 304 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందులో పురుషులు 12వేల 948 ఉండగా మహిళలు 13,304 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ శాతం 74.18 /: గా నమోదు అయ్యింది. ఓటింగ్ సరళిని కలెక్టర్ సిక్తా పట్నాయక్ పర్యవేక్షించారు. ఎస్పీ వినీత్ కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా పట్టణంలోని 5వ వార్డు లో మాజీ డిసిసి అధ్యక్షులు కుంభం శివకుమార్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి పోలింగ్ స్టేషన్ 11 లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

అత్యధికంగా 10 వ వార్డులో… అత్యల్పంగా 7 వ వార్డులో పోలింగ్ నమోదు…

పట్టణంలో 24 వార్డులు ఉండగా అత్యధికంగా 10వ వార్డులో పోలింగ్ నమోదయింది. వార్డులో మొత్తం 1256 మంది ఓటర్లు ఉండగా 1021 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ శాతం 81.29 /: గా నమోదయింది. అలాగే అత్యల్పంగా 7 వ వార్డులో పోలింగ్ నమోదయింది. ఈ వార్డులో 1633 మంది ఓటర్లు ఉండగా 1018 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ శాతం 62.34/: గా నమోదయింది.

పట్టణంలోని వార్డుల వారిగా పోలైన ఓట్లు…

పట్టణంలో 24 వార్డులు ఉండగా ఒకటో వార్డులో 1407 మంది ఓటర్లకు 1083 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. అలాగే 2 వార్డులో 1127 కి గాను 912, 3 వార్డులో 1667 కు 1306, 4 వార్డులో 991 కి 762, 5 వ వార్డులో 1778 కి 1158, 6 లో 1822 కు గాను 1379, 7 వార్డులో 1633 కి 1018, 8 లో 2102 కి 1333, 9 వ వార్డులో 1810 కి గాను 1442, 10 వ వార్డులో 1256 కి గాను 1021, 11 వ వార్డులో 1798 కి గాను 1411, 12వ వార్డులో 1378 కి గాను 1045, 13వ వార్డులో 1552 కి గాను 1169,14వ వార్డులో 1415 కి గాను 1079, 15 వ వార్డులో 1309 కి గాను 1063, 16వ వార్డులో 1162 కి గాను 851, 17 వ వార్డులో 1446 కి గాను 1044, 18 వ వార్డులో 1195 కి గాను 933, 19 వ వార్డులో 1437 కి గాను 1055, 20 వ వార్డులో 1500 కి గాను 1084 , 21 వ వార్డులో 1661 కి గాను 1279, 22వ వార్డులో 1422 కి గాను 1050, 23 వ వార్డులో 1213 కి గాను 828, 24 వ వార్డులో 1379 కి గాను 998 పోలయ్యాయి.

Leave A Reply

Your email address will not be published.