Take a fresh look at your lifestyle.

ఘనంగా హోలీ వేడుకలు బైక్ ఫై తిరిగి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే కుంభం..

 
ముద్ర, భువనగిరి ప్రతినిధి :
యాదాద్రి భువనగిరి జిల్లాలో మంగళవారం హోలీ ఘనంగా జరుపుకున్నారు. సోమవారం అర్ధరాత్రి నుంచే కూడలీలలో కామదహనం చేసి రంగులు చల్లుకుంటూ సంబరాలు జరుపుకున్నారు. భువనగిరి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ తంగళ్లపల్లి శ్రీవాణి రవికుమార్, వైస్ చైర్మన్ పోతంశెట్టి మంజుల వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు రంగులు చల్లుకుని శుభాకాంక్షలు తెలిపారు. అక్కడ నుండి వినాయక చౌరస్తా మీదుగా ఎమ్మెల్యే బైక్ నడుపుతూ భారీ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే పట్టణ ప్రజలకు అభివాదం చేస్తూ అన్ని వార్డులలో తిరిగారు. కార్యకర్తలతో రంగులు జల్లుతూ, బ్యాండ్ మేళా మధ్య డాన్సులు చేస్తూ హోలీ వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజక వర్గ ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు. మన సంస్కృతి సంప్రదాయాలు గొప్పవని, ప్రతీ పండగకు ఒక పరమార్థం ఉంటుందని అన్నారు. హోలీ అన్ని రంగుల కలయిక అని, సంతోషం , సామరస్యం తో కేరింతలు కొడుతూ నిర్వహించుకున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో భువనగిరి మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జహంగీర్, పట్టణ పార్టీ అధ్యక్షులు కూర వెంకటేష్, నాయకులు పోత్నక్ ప్రమోద్ కుమార్, కాంగ్రెస్ కౌన్సిలర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.