ముద్ర : కాప్రా
పేద వైద్య విద్యార్థులకు స్వచ్ఛంద సంస్థలు ఆర్థిక చేయూత నివ్వాలని మాజీ మంత్రి హరీష్ రావు సూచించారు.
ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో హరీష్ రావు నివాసం లో 7 గురు ఎంబీబీఎస్ విద్యార్థులకు ఎంబీబీఎస్ చెక్కులు అందజేశారు.
బి ఎల్ ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో వైద్య విద్యార్థులకు చెక్కులు అందజేయడం అభినందనీయమన్నారు.
ప్రస్తుత విద్యా సంవత్సరంలోనే మొత్తం 122 మంది వైద్య విద్యార్థులకు వారి విద్యా ఖర్చుల కోసం ఆర్థిక సహాయం అందించడం జరిగిందని. ఇది కేవలం దానంగా కాకుండా, భవిష్యత్ ఆరోగ్య వ్యవస్థలో పెట్టుబడిగా భావించాల్సిన అంశమని ఆయన తెలిపారు.
వెనుకబడిన వర్గాల నుంచి వచ్చే ప్రతిభావంతమైన యువతను ప్రోత్సహిస్తూ, విద్య ద్వారా సాధికారత కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని వెల్లడించారు.
మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు దూరదృష్టి నాయకత్వంలో, తెలంగాణ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో వైద్య కళాశాలల స్థాపనతో “వైట్ కోట్ విప్లవం” సాకారమైందని, దీని ద్వారా వైద్య విద్య అవకాశాలు విస్తరించి, ప్రభుత్వ వైద్య సేవలు మరింత బలోపేతం అయ్యాయని హరీష్ రావు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు దేవేందర్ రెడ్డి ,ప్రభుదాస్ ప్రవీణ్ ముదిరాజ్ , బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు మహేష్ గౌడ్, ప్రవీణ్ కరిపే పిల్లి నాగరాజు, పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.