- కార్మిక రైతు సంఘాల ఆధ్వర్యంలో ద్విచక్ర వాహనాల ర్యాలీ.
ముద్ర ప్రతినిధి, హనుమకొండ: మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక రైతు వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ జులై 9న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూసోమవారం కార్మిక రైతు సంఘాల ఆధ్వర్యంలో వరంగల్ గ్రెయిన్ మార్కెట్ సెంటర్ నుండి ద్విచక్ర రాయాలని కాశిబుగ్గ పోచమ్మ మైదానం వరంగల్ చౌరస్తా మీదుగా రైల్వే స్టేషన్ వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు కార్యకర్తలు మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని ప్రభుత్వ రంగసంస్థల ప్రైవేటీకరణ ఉపసంహరించుకోవాలని మొదలగు డిమాండ్లతో కూడిన ప్లే కార్డులను చేతబూని పెద్దఎత్తున నినాదాలు చేశారు. ర్యాలీ అనంతరం రైల్వే స్టేషన్ సెంటర్లో కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు .ఏఐటీయూసీ సిఐటియు ఏఐసిటియు ఏఐకేఎంఎస్ టియుటిసి ఐఎఫ్టియు ఏఐఎఫ్టీయూ నాయకులు మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం గత 11సంవత్సరాల నుండి కార్మిక రైతువ్యతిరేక విధానాలను అనుసరిస్తుందని విమర్శించారు. 8 గంటల పని దినాన్ని తీసివేసి 10 గంటల పని విధానాన్ని అమలు చేస్తున్నదని పాత పద్ధతి కొనసాగించాలని డిమాండ్ చేశారు కనీస వేతనం నెలకు 26 వేల రూపాయలుగా ఇవ్వాలని కాంట్రాక్టు కార్మికుల వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు .మూడు వ్యవసాయ నల్లచట్టాలను రద్దుచేసి నూతన మార్కెట్ వ్యవసాయ విధానాన్ని మళ్లీ తీసుకువచ్చిందని భారత దేశ ప్రయోజనాలను దెబ్బతీసే యూఎస్ఏ ఈయు మరియు బ్రిటన్ దేశాలతో కేంద్ర ప్రభుత్వం స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలు చేసుకోవడానికి పూనుకుంటున్నదని వీటికి వ్యతిరేకంగా పోరాడాల న్నారు. ఈ కార్యక్రమానికి అఖిల భారత రైతు కూలీ సంఘం (ఏ ఐ కె ఎమ్ ఎస్) జిల్లా ప్రధాన కార్యదర్శి రాచర్ల బాలరాజు అధ్యక్షత వహించగా ఏఐసిటియు రాష్ట్ర గౌరవ అధ్యక్షులు నర్రా ప్రతాప్ ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు చెన్నకేశవులు సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎండి బషీర్ ఆరూరి కుమార్ ఏ ఐ సి సి టి యు రాష్ట్ర అధ్యక్షులు అక్కెనపల్లి యాదగిరి ఏఐసిటియు జిల్లా ప్రధాన కార్యదర్శి సుంచు జగదీశ్వర్ ఏఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు బైరబోయిన ఐలయ్య ఐ ఎఫ్ టి యు జిల్లా నాయకులు బండి కుమార్ టి యు సి ఐ నాయకులు కృష్ణారావు ఏఐయుకెఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి చిర్ర సూరి లతోపాటు ఆయా సంఘాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.