మహాదేవపూర్, ముద్ర:
మేడిగడ్డ బ్యారేజ్ నీ సిఎంఓ బృందంతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోట రాజబాబు, ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ ఐత ప్రకాశ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కటకం అశోక్, పలిమెల సర్పంచ్ జవ్వాజి పుష్పలత తిరుపతి, బ్లాక్ కాంగ్రెస్ మైనారిటీ సెల్ ప్రెసిడెంట్ అస్రార్ ఖురేషి తదితరులు సందర్శించారు. ఈ నెల 20 తేదీన మేడిగడ్డ బ్యారేజ్ కృంగిన పిల్లర్లని పరిశీలించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రానున్న విషయం విదితమే.