Take a fresh look at your lifestyle.

​కూకట్‌పల్లి అయ్యప్ప స్వామి ఆలయంలో ఘనంగా ‘పంగుని ఉత్తిరం’ వేడుకలు

ముద్ర కూకట్‌పల్లి :
తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో అత్యంత వైభవంగా జరుపుకునే అయ్యప్ప స్వామి జయంతి (పంగుని ఉత్తిరం) వేడుకలు బుధవారం కూకట్‌పల్లిలోని అయ్యప్ప స్వామి దేవస్థానంలో అత్యంత భక్తిశ్రద్ధలతో జరిగాయి. శబరిమలలో బ్రహ్మోత్సవాల ముగింపు పర్వదినం కావడంతో, ఇక్కడ కూడా ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది.​ఈ వేడుకలను పురస్కరించుకొని దేవస్థానం చైర్మన్ వడ్డేపల్లి రాజేశ్వరరావు ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అర్చక స్వాముల పర్యవేక్షణలో స్వామివారికి నిర్వహించిన అభిషేకం, అర్చన, హారతుల్లో ఆయన పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.​ఈ సందర్భంగా రాజేశ్వరరావు మాట్లాడుతూ.. అయ్యప్ప స్వామి జయంతి నియమానికి, ధర్మానికి, మరియు నిరుపమ భక్తికి నిదర్శనమని పేర్కొన్నారు.
​”పంగుని ఉత్తిరం పర్వదినం మనలోని దైవత్వాన్ని మేల్కొలిపే పవిత్ర ఘడియ. అయ్యప్ప స్వామి ఆశీస్సులతో సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం వర్ధిల్లాలని, అందరికీ అభివృద్ధి కలగాలని ప్రార్థించాను” అని ఆయన తెలిపారు.
​ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మరియు పెద్ద సంఖ్యలో అయ్యప్ప భక్తులు పాల్గొని స్వామివారి కృపాకటాక్షాలను అందుకున్నారు.

Leave A Reply

Your email address will not be published.