Take a fresh look at your lifestyle.

యాంత్రిక వ్యవసాయం ద్వారా రైతులకు అధిక లాభాలు

 

రైతులకు వ్యవసాయ యాంత్రీకరణ పథకం రాయితీ పై యంత్రాల పంపిణీ కార్యక్రమం హాజరైన ఎమ్మెల్యే

ముద్ర, గద్వాల:

యాంత్రిక వ్యవసాయం ద్వారా రైతులకు అధిక లాభాలు.. రైతులు ఆధునిక యంత్రాల ద్వారా విషయం చేస్తే అధిక లాభాలు రావచ్చునని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. గద్వాల నియోజకవర్గ పరిధిలోని రైతులకు వ్యవసాయ యాంత్రీకరణ పథకం–2025-26 కింద 50 శాతం రాయితీపై వ్యవసాయ యంత్ర పరికరాలను బుధవారం గద్వాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో అర్హులైన 16 మంది లబ్దిదారులకు పంపిణి చేశారు.

గట్టు మండలంలో 14 మంది రైతులకు, గద్వాల మండలంలో ఇద్దరు లబ్దిదారులైన రైతులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా వ్యవసాయ యాంత్ర పరికరలాను. పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో యాంత్రీకరణ ద్వారా రైతులపై శ్రమ భారం తగ్గడంతో పాటు సాగు ఖర్చులు తగ్గి దిగుబడులు పెరుగుతాయని తెలిపారు. రైతుల ఆదాయం పెంచడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, అందుకే రాయితీలతో ఆధునిక యంత్రాలను రైతులకు అందుబాటులోకి తీసుకువస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గద్వాల వ్యవసాయ మార్కెట్ యార్డు చైర్మన్ కుర్వ హన్మంతు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వీరప్ప, ఏడీఏ సంగీత లక్ష్మీ, గట్టు‌, గద్వాల, ధరూర్ ,‌కేటిదొడ్డి మండలాల వ్యవసాయ అధికారులు,‌ మాజీ జెడ్పీ చైర్మన్ బండారు భాస్కర్, మాజీ జిల్లా గ్రంథాలయ చైర్మన్ జంబు రామన్ గౌడ, నాయకులు పటేల్ ప్రభాకర్ రెడ్డి మహేశ్వర్ రెడ్డి, మాజీ ఎంపీపీ విజయ్, జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు రాజశేఖర్, సర్పంచులు శివ , పవన్ కుమార్ రెడ్డి, విజేయులు నాయకులు ఉరుకుందు, రామయ్య శెట్టి, యుగేందర్ గౌడ్, గోవిందు, శేఖర్ రెడ్డి తిమ్మారెడ్డి, శేఖర్ రెడ్డి, సిల్వర్ రోటవేటర్ డిస్ట్రిబ్యూటర్ దేవేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.