Take a fresh look at your lifestyle.

ఘనంగా రంజాన్ పర్వదిన వేడుకలు రంజాన్ పర్వదిన సందర్భంగా తుంగతుర్తి మండల కేంద్రంలోని ఈద్గాలో ముస్లిం సోదరుల ప్రత్యేక ప్రార్థనలు

 

ముద్ర… తుంగతుర్తి….
మండల వ్యాప్తంగా ముస్లింలు పవిత్ర రంజాన్ మాసం ముగింపు సందర్భంగా జరుపుకునే ఈద్ – ఉల్-ఫితర్ (రంజాన్) పర్వదిన వేడుకలను శనివారం ఘనంగా అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు, ఈ సందర్భంగా ముస్లింలందరూ స్థానిక ఈద్గాలో ఉదయమే సామూహిక ప్రార్ధనలు చేశారు, నెల రోజులపాటు భక్తిశ్రద్ధలతో ఉపవాస దీక్ష చేపట్టిన ముస్లింలు నేడు పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా మత గురువు మౌలానా అబ్దుల్ ఆహాద్ మాట్లాడుతూ క్రమశిక్షణ, దైవచింతన, దానగుణంతోపాటు ఇతరుల పట్ల ప్రేమ దయ జాలి చూపించే దైవ ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క బోధనలు ప్రతి ఒక్కరూ పాటించాలని అన్నారు, కులమత బేధాలు లేకుండా అందరం ఐక్యంగా ఉంటూ సోదర భావంతో ముందుకెళ్లాలని కోరారు, ఈ సందర్భంగా లోక కళ్యాణం కోసం శాంతి సౌభాగ్యాల కోసం ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని ప్రత్యేక దువా చేశారు, ఖురాన్ పఠనం గావించి నమాజ్ అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ ఈద్ ముబారక్ అంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు, ఈద్గాలో ముస్లింల ప్రార్ధనలతో సందడిగా మారింది, ఈ కార్యక్రమంలో మజీద్ నూర్ కమిటీ అధ్యక్షులు ఎండి జాన్, ఉపాధ్యక్షులు ఎస్కే లాల్, మైనారిటీ యూత్ కమిటీ అధ్యక్షులు ఎస్కే నజీర్, ఉపాధ్యక్షులు మొహమ్మద్ అబ్దుల్, కార్యదర్శి ఎస్కె కరీం, సభ్యులు నజీర్ , శాలం, సిద్ధిక్, సమీర్, మహబూబ్ అలీ, ఫజిలుద్దీన్, వహీద్, అఫ్జల్, ఎస్కే జానీ మియా, అలీ సాబ్, ఉస్మాన్, అక్రమ్, షరీఫ్, హఫీజ్, అన్వర్, మీరా సాబ్, తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.