- సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి పెరుముల గోపాల్.
ముద్ర,అచ్చంపేట: నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలో సిపిఐ అచ్చంపేట నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం పెంచిన సిలిండర్ ధరలను తగ్గించాలని అంబేద్కర్ చౌరస్తాలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ సిపిఐ అచ్చంపేట నియోజకవర్గ కార్యదర్శి పెరుముల గోపాల్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలను తక్షణమే తగ్గించాలి లేని క్రమంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు ధర్నాలు నిర్వహిస్తామని తెలియజేశారు, కేంద్ర ప్రభుత్వం ఈనెల 8న గృహ అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్ ధరలను ఉన్నట్టుంది 50 రూపాయలు పెంచి వెంటనే అమల్లోకి తెచ్చింది దీనివలన దేశంలోని 35 కోట్ల గృహ వినియోగదారులైన పేద,సామాన్య, మధ్యతరగతి ప్రజలకు పెనుబారం మోపింది.దీనివలన పట్టణాలలో ఒక్క సిలిండర్ ధర 855 నుంచి 905 పెరిగింది గ్రామాలలో ఒక సిలిండర్ ధర 930 నుంచి 980 పెరిగిందని అన్నారు.అదేవిధంగా పెట్రోలు డీజిల్ ధరలపై రెండు శాతం ధర లు పెంచి పేద ప్రజలపై పెనుబారం మోపుట కు సిద్ధమైందని వార్తలు వస్తున్నాయి అని ఆయన అన్నారు.కేంద్ర ప్రభుత్వం ఈ దేశంలో ఉన్న వ్యాపారవేతలకు అధిక లాభాలను తెచ్చి పెట్టేందుకు బిజెపి ప్రభుత్వం అహర్నిశలు కష్టపడుతూ పేద మధ్యతరగతి ప్రజలపై అధిక సుంకాల భారాన్ని మోపుతుందని గోపాల్ అన్నారు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎన్నికలకు ముందు చేసిన వాగ్దానాలకు విరుద్ధంగా నియంత పాలన కొనసాగిస్తుందని ఈ బీజేపీ ప్రభుత్వానికి ప్రజలే తగిన బుద్ధి చెప్పాలని పెంచిన ధరలను తగ్గించేంతవరకు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ప్రజల పక్షాన నిలబడి పోరాడుతుందని గోపాల్ అన్నారు.ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాగర్ కర్నూల్ జిల్లా కార్యదర్శి బలముల ప్రేమ్ కుమార్, ఉపాధ్యక్షులు నరేష్, జిల్లా నాయకులు ఈ. ఆంజనేయులు, ప్రవీణ్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు