- ఉచితంగా ఓపి, రక్త పరీక్షలు, ఎక్స్రే.
ముద్ర ,మధిర : మధిర పట్టణంలోని ఏకేఆర్(కొండల్ రావు) మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి లో గురువారం నిర్వహించిన ఎముకలు కీళ్లవ్యాధుల ఉచిత వైద్య శిబిరం విజయవంతమైంది.విజయవాడకు చెందిన స్వర మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి అధినేత, ప్రముఖ ఆర్థోపెడిషియన్ డా. అవినాష్ ఏంఎస్ ఆర్థో నేతృత్వంలో శిబిరానికి వచ్చిన సుమారు 120 మందికి పరీక్షలు నిర్వహించి వైద్య సేవలను అందించారు. కీళ్లు,కండరాల వ్యాధులు, మెడ నొప్పి మోకాళ్ళ నొప్పి, వెన్నుపూస వ్యాధులు, కీళ్ల మార్పిడి మొదలైన వ్యాధులకు సంబంధించిన మధ్య వయస్కులు, వృద్ధులు మహిళలు శిబిరానికి రాగా, వారిని పరీక్షించి అవసరమైన రక్త పరీక్షలు, ఎక్స్రే లను ఉచితంగా తీశారు. శిబిరానికి వచ్చిన వారికి తాగునీరు, మజ్జిగ అందజేశారు.ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఏకేఆర్ ఆసుపత్రి అధినేత డాక్టర్ అన్నేమళ్ళ కొండలరావు మాట్లాడుతూ,మధిర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించేందుకు తమ ఆసుపత్రిని మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిగా మార్చడం జరిగిందన్నారు.త్వరలోనే అన్ని రకాల అధునాతన వైద్య సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు.సేవా దృక్పథంతో ప్రజలకు వైద్య సేవలను అందించాలన్న లక్ష్యంతో నిర్వహిస్తున్న ఆసుపత్రి లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం అభినందనీయమని, ఈ శిబిరంలో తమ వంతు సేవలను అందించే అవకాశం కల్పించడం గర్వంగా ఉందని స్వర మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ అవినాష్ పేర్కొన్నారు.ఈ వైద్య శిబిరంలో డాక్టర్ అవినాష్ ఎమ్మెస్ అర్థో, డాక్టర్ జాఫర్ ఆర్థో, సంపత్ కుమార్ ఎం ఎస్ పిఆర్వోలు రాజరత్నం రషీద్ సుధాకర్,చావా వేణు, ఏ కే ఆర్ హాస్పిటల్ వైద్యురాలు డా. శ్రీలేఖ ఫిజియోథెరపిస్ట్ సిబ్బంది పాల్గొన్నారు.
