రామకృష్ణాపూర్, ముద్ర విలేకరి : క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని పట్టణ ఎస్సై జీ. రాజశేఖర్ అన్నారు. స్థానిక 14 వ వార్డు పోచమ్మ బస్తీ యూత్ ఆధ్వర్యంలో గురువారం రాత్రి ఏర్పాటు చేసిన బాల్ బ్యాట్మెంటన్ టోర్నమెంట్ పోటీలను రెండో ఎస్సై లలితతో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం క్రీడాకారులతో కలిసి కాసేపు బాల్ బ్యాట్మెంటన్ ఆడారు. మాజీ వార్డు కౌన్సిలర్ గడ్డం విజయలక్ష్మి – రాజు,ప్రభాకర్,శ్రీను,ప్రశాంత్, టోర్నమెంట్ ఆర్గనైజర్లు నాగరాజు,వికాస్,శ్రావణ్ పాల్గొన్నారు.