Take a fresh look at your lifestyle.

వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షణ : జిల్లా కలెక్టర్ హనుమంతరావు

ముద్ర ప్రతినిధి, భువనగిరి :

బుధవారం జిల్లాలో జరుగుతున్న 6 మున్సిపాలిటీలకు సంబంధించిన పోలింగ్ ప్రక్రియను పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేసిన వెబ్ కాస్టింగ్ వ్యవస్థను జిల్లా కలెక్టర్ హనుమంతరావు కలెక్టరేట్‌లో ప్రత్యక్షంగా పరిశీలించారు. జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల నుండి ప్రత్యక్షంగా ప్రసారం అవుతున్న దృశ్యాలను మానిటరింగ్ చేస్తూ పోలింగ్ నిర్వహణను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి జయమ్మ, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.