Take a fresh look at your lifestyle.

పదవ తరగతి పరీక్షలను సజావుగా నిర్వహించాలి –జిల్లా కలెక్టర్ దీపక్ తివారి. 

 ముద్ర,వికారాబాద్ జిల్లా ప్రతినిధి :

పదవ తరగతి పరీక్షలను సజావుగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ అధికారులకు సూచించారు.

శనివారం పదవ తరగతి పరీక్షల సందర్భంగా జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలోని పరీక్ష  కేంద్రాన్ని ఆకస్మికంగా పర్యటించి పరీక్ష నిర్వహణ తీరును  పరిశీలించారు. అనంతరం చీఫ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో  డ్యూటీ రిజిస్టర్, ప్రశ్నపత్రాల వివరాలను అడిగి తెలుసుకున్నారు.  విద్యార్థుల హాజరు శాతం అదేవిధంగా మెడికల్ సిబ్బంది గురించి ఆరా తీసి అక్కడ ఉన్న మందులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ జరుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పరీక్ష కేంద్రాల్లో మంచినీటి సదుపాయంతో పాటు మందులను అందుబాటులో ఉంచాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. జిల్లా కలెక్టర్ తో పాటు జిల్లా విద్యాధికారి రేణుకా దేవి, చీఫ్ సూపరింటెండెంట్ రాజులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.