ముద్ర ప్రతినిధి, భువనగిరి : యాదగిరిగుట్ట ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు పురస్కరించుకొని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి 31 వ జ్యోతియాత్ర నిర్వహించనున్నట్లు రథయాత్ర ఆహ్వాన కమిటీ చైర్మన్ సద్ది వెంకట్ రెడ్డి తెలిపారు.ఆదివారం భువనగిరిలో యాత్ర సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ నెల 26న ఉదయం 10 గంటలకు హైదరాబాద్, బర్కత్ పురా,యాదాద్రి భవనం నుంచి ప్రారంభమై ఉప్పల్,ఘట్ కేసర్,బీబీనగర్,భువనగిరి మీదుగా మార్చి 01 యాత్ర యాదగిరిగుట్ట క్షేత్రానికి చేరుకుంటుందన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.ఈ సమావేశంలో రథయాత్ర ఆహ్వాన కమిటీ గౌరవ అధ్యక్షుడు డా. ఎంపల్ల బుచ్చిరెడ్డి ఉపాధ్యక్షులు, కాసుల సత్యనారాయణ గౌడ్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్, దిడ్డి బాలాజీ ప్రధాన కార్యదర్శి, బండారు ఆగమయ్య గౌడ్,గడ్డం జ్ఞాన ప్రకాష్ రెడ్డి, దీకొండ వెంకటేష్, బెల్డే అశోక్, ఎస్పీ ఉపేందర్ రావ్, ఎచన్ గణపతి, ఆడపాల నరేన్, అబ్బినేని వెంకట్రావు పాల్గొన్నారు.