Take a fresh look at your lifestyle.

అంగరంగ వైభవంగా హైటెక్స్ లో రాగం వారి వివాహ మహోత్సవం

మాదాపూర్,ముద్ర: శేరిలింగంపల్లి కార్పొరేటర్ శ్రీ రాగం నాగేందర్ సుజాత యాదవ్ దంపతుల ప్రధమ కుమారుడు రాగం అనిరుద్ యాదవ్, జాగృతి సాయి వివాహం హైదరాబాద్ లోని హైటెక్స్ లో అంగరంగ వైభవంగా జరిగింది.ఆదివారం ఉదయం 8.19 నిమిషాలకు ఈ జంట మూడుముళ్ల బంధంతో ఒకటి అయ్యారు.హైదరాబాద్‌ హైటెక్స్‌ లో వివాహమహోత్సవ వేడుకకు రాజకీయ నాయకులు ప్రముఖులతో పాటు పారిశ్రామిక వేత్తలు,ఇరుగుపొరుగు రాష్ట్రాల నుంచి ప్రముఖులంతా విచ్చేసారు. పారిశ్రామిక దిగ్గజాలు ఈ వేడుకకు హాజరవుతుండడంతో భారీగా రక్షణ వలయాల్ని కూడా ఈ వేడుకల్లో ఏర్పాటు చేశారు.వేకువజాము 7 గం.ల నుంచే హైటెక్స్‌లో అతిధులతో పరిణయం హడావుడి మొదలైంది.ప్రముఖులంతా ఈ వివాహానికి హాజరయ్యి,వధూవరులకు తమ శుభాకాంక్షలు తెలియచేశారు.రాగం నాగేందర్ యాదవ్ వివాహానికి వచ్చిన ప్రముఖులను అందరినీ పలకరిస్తూ వివాహ వేడుక ఘనంగా జరిగేలా చర్యలు చేపట్టారు.వేడుకకు రాజకీయ ప్రముఖులతో పాటు అభిమానుల భారీ సంఖ్య రాకతో సందడి నెలకొంది.వివాహ వేడుకకు రాజకీయ ప్రముఖులు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క,మంత్రి పొన్నం ప్రభాకర్,ఎంపి రఘనందన్ రావు ,ఎంపి కొండా విశ్వశ్వర్ రెడ్డి , పిఏసీ చైర్మెన్, ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి,ఎమ్మెల్యే అరేకపూడి గాంధీ,ఎంపి అనిల్ కుమార్ రెడ్డి,మాజీ మంత్రి కేటీఆర్,మాజీ మంత్రి హరీష్ రావు,మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్, మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి , జిహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి, మాజీ ఎంపి అంజన్ కుమార్ యాదవ్, మాజీ ఎంపి హన్మంత్ రావు, గౌరవ పిసిసి అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, ఎంబిసీ ఛైర్మెన్ జెరిపేటి జైపాల్,మన్నే సతీష్, ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి,ఎమ్మెల్యే సునీత లక్ష్మా రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ చైర్ పర్సన్ శివసేన రెడ్డి,తదితర డివిజన్ల కార్పొరేటర్లు, ఇతర పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నత అధికారులు పలువురు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

Leave A Reply

Your email address will not be published.