ముద్ర కూకట్‌పల్లి :
కుటుంబ సభ్యులు శుభకార్యానికి వెళ్లిన సమయంలో ఓ వివాహిత ఇంటి నుండి అదృశ్యమైన ఘటన కెపిహెచ్‌బి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
హైదర్ నగర్, నందమూరి నగర్‌కు చెందిన మహమ్మద్ ఖలీల్ మియా కుమార్తె రజియా బాను బేగం (25) గత ఆరు నెలలుగా తన తండ్రి వద్దే ఉంటోంది. వివాహం జరిగినప్పటికీ భర్తతో మనస్పర్థల కారణంగా ఆమె పుట్టింట్లో ఉంటూ, హైటెన్షన్ లైన్ సమీపంలోని ఒక బట్టల దుకాణంలో ప్రైవేట్ ఉద్యోగం చేస్తోంది.
ఈ నెల 16వ తేదీ ఉదయం 7 గంటలకు కుటుంబ సభ్యులంతా జహీరాబాద్‌లో ఒక ఫంక్షన్‌కు వెళ్తుండగా, తలనొప్పిగా ఉందని చెప్పి రజియా ఇంటి వద్దే ఉండిపోయింది. సాయంత్రం 6 గంటల సమయంలో కుటుంబ సభ్యులు తిరిగి వచ్చేసరికి రజియా కనిపించకుండా పోయింది. ఆమెతో పాటు తన లగేజీ మరియు వ్యక్తిగత సామాగ్రిని కూడా తీసుకువెళ్లినట్లు తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నారు.
బాధిత తండ్రి ఫిర్యాదు మేరకు కెపిహెచ్‌బి పోలీసులు *’మహిళా మిస్సింగ్’* కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.