Take a fresh look at your lifestyle.

అయ్యప్ప ఆలయంలో ప్రత్యేక పూజలు

ముద్ర ప్రతినిధి, భువనగిరి : అయ్యప్ప స్వామి జన్మ నక్షత్రమైనటువంటి ఉత్తర నక్షత్రం రోజు అయ్యప్ప స్వామివారి పుట్టినరోజు సందర్భంగా భువనగిరి శబరి నగర్ లోని శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో బుధవారం ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం 6 గంటలకు గణపతి హోమం అయ్యప్ప స్వామికి అభిషేకాలు అలంకరణ సత్యనారాయణ స్వామి వారి వ్రత కార్యక్రమం నిర్వహించారు. సత్యనారాయణ స్వామి మూలవిరాట్, అయ్యప్ప స్వామి ఉత్సవమూర్తులు ప్రాణవట్టంలో పెట్టి అభిషేకం చేశారు. అష్టోత్తరం, అర్చన, అయ్యప్పస్వామివారి పడిపూజ ఘనంగా జరిపారు. ముఖ్య అతిధిగా జిల్లా అడిషనల్ కలెక్టర్ వెంకారెడ్డి పాల్గొన్నారు. సుమారు 200 మంది భక్తులందరికీ అన్న ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ అయితా రాములు, అధ్యక్షులు నూనె వెంకటేశ్వర్లు, కార్యదర్శి దిడ్డి సత్యం, ట్రెజరర్ శ్యాంఘటాని, ఉపాధ్యక్షులు గాదె శ్రీనివాస్, చింత రవి, ఆర్గనైజింగ్ సెక్రెటరీ చీకటిమల్ల రాములు, సభ్యులు పోకల సోమన్న, మంచాల రిషికేష్, అల్లే నరేష్, సిద్ధగొని సుధాకర్ గౌడ్, రావుల శ్రీధర్, మాజీ చైర్మన్ మంచాల ప్రభాకర్, ఎంకోజి పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.