Take a fresh look at your lifestyle.

ఎక్స్ రే కేంద్రాన్ని ప్రారంభించిన ఎంఎల్ఏ ఏలేటి

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లా నర్సాపూర్ జి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఎక్స్‌రే సెంటర్ ను శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ రహదారిపై అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని, స్థానికంగా ఉన్న ఈ హాస్పిటల్ ను గత ప్రభుత్వం 50పడకల ఆసుపత్రిగా ఆధునీకరిస్తున్నట్లు ప్రకటించినా ఆచరణలో మాత్రం చేపట్టలేకపోయిందన్నారు. కనీస వసతులు, సిబ్బంది కొరత తదితర సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వీలైనంత మేరకు ప్రభుత్వ అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు.వరి ధాన్యం కల్లాలను పరిశీలించిన ఎమ్మెల్యే నర్సాపూర్ మండల కేంద్రంలోని వడ్ల కొనుగోలు కేంద్రంలో అకాల వర్షాల కారణంగా తడిసిన ధాన్యాన్ని ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి పరిశీలించారు. తడిసిన ధాన్యం సైతం ప్రభుత్వం కొనాలని, త్వరితగతిన వడ్ల కొనుగోలు పూర్తి చేయాలని సూచించారు. అధిక తూకం, రైస్ మిల్లులో తగ్గింపులు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులను సూచించారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్ రెడ్డి, రావుల రాంనాథ్, ముత్యం రెడ్డి, చంద్రకాంత్, మండల అధ్యక్షులు బర్కుంట నరేందర్, స్థానిక నాయకులు శ్రీకాంత్ రెడ్డి, అర్జున్, మహిపాల్, దత్తురాం, రాజేందర్, రాజు తో పాటు వైద్యాధికారులు రాజేందర్, ప్రమోద్ చంద్రా రెడ్డి ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.